ప్రైవసీ పాలసీ

ఈ వెబ్ సైట్ ఈ ప్రైవసీ పాలసీ కిందకు వస్తుంది. ఈ ప్రైవసీ పాలసీతో పాటు, కింది సమాచారం యెహోవాసాక్షుల సమావేశాలకు హాజరయ్యే ప్రతినిధులకు, వాలంటీర్లకు వర్తిస్తాయి.

ప్రతినిధులు, వాలంటీర్లు

యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశానికి లేదా ప్రత్యేక సమావేశానికి హాజరయ్యేందుకు దరఖాస్తులు నింపే ప్రతినిధులు తమ వ్యక్తిగత డేటాను అంటే, తమ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్, తదితర వివరాల్ని ఇచ్చారు. సమావేశ ఏర్పాట్లు చూసుకునే యెహోవాసాక్షుల ఆతిథ్య బ్రాంచి కార్యాలయం, అలాగే ఆయా యాక్టివిటీల పట్టిక తయారుచేసే ఆతిథ్య కమిటీలు ఆ సమాచారాన్ని సమావేశ సంబంధంగా వాడేందుకు ప్రతినిధులు తమ దరఖాస్తుల్లో ఆమోదం తెలిపారు. తమ స్వదేశంలో ఉన్నంత డేటా ప్రొటెక్షన్ లేని ఆతిథ్య దేశానికి ఆ సమాచారాన్ని అందించడం కూడా ఆ ఆమోదంలో భాగమేనని ప్రతినిధులు అంగీకరించారు.

సమావేశాన్ని ఏర్పాటు చేసిన బ్రాంచి కార్యాలయానికి సహకరించే వాలంటీర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని అంటే, తమ పేరు, పుట్టిన తేదీ, చిరునామా, ఫోన్ నంబర్, తదితర వివరాల్ని ఈ వెబ్ సైట్లో ఇచ్చారు. ఆ సమాచారాన్ని ఈ వెబ్ సైట్లో ఇవ్వడం ద్వారా, వాళ్లు తమ సమాచారాన్ని వాడేందుకు, సమావేశ ఏర్పాట్లు చూసుకుంటున్న యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయానికి, అలాగే ఆతిథ్య కమిటీలకు, వాళ్లకు సహకరించే వ్యక్తులకు ఆమోదాన్ని తెలిపారు.

తాము సబ్మిట్ చేసిన సమాచారాన్ని ప్రతినిధులు, వాలంటీర్లు లాగిన్ సెక్షన్ లో చూసుకోవచ్చు. తమ దేశంలో జరిగే సమావేశానికి వచ్చే ప్రతినిధుల అవసరాలు చూసుకోవడానికి, వాలంటీర్లను సంప్రదించడానికి వీలుగా ఆతిథ్య కమిటీలు ఆ సమాచారాన్ని యాక్సెస్ చేసే వీలుంది. ప్రతినిధుల వ్యక్తిగత సమాచారాన్ని కేవలం ప్రయాణానికి, ప్రయాణ సంబంధిత అవసరాలకు, అలాగే సమావేశ సమయంలో సమావేశానికి సంబంధించిన యాక్టివిటీలు వ్యవస్థీకరించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. వాలంటీర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేవలం వాలంటీర్ల సేవలకు సంబంధించి, సమావేశ పనులకు సంబంధించి మాత్రమే ఉపయోగిస్తారు..

ప్రతీ ఆతిథ్య కమిటికీ కేవలం తమ దేశంలో జరిగే సమావేశానికి వచ్చే ప్రతినిధుల, వాలంటీర్ల వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సమాచారాన్ని కేవలం సమావేశ సంబంధిత కార్యకలాపాల్ని వ్యవస్థీకరించడానికే ఉపయోగిస్తారు. సమావేశం అయిపోయాక ఆ సమాచార అవసరం తీరిన వెంటనే దాన్ని తొలగిస్తారు.

ప్రతినిధులు, వాలంటీర్లు కావాలంటే తమ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకుండా ఉండొచ్చు లేదా ఈ వెబ్ సైట్ నుంచి తొలగించమని రిక్వెస్టు చేయవచ్చు. కాకపోతే ఒకటి, వాళ్లు ఫలాని సమావేశానికి హాజరయ్యేందుకు గానీ, దాంట్లో వాలంటీర్లుగా సేవచేసేందుకు గానీ ఇక ఎంతమాత్రం అర్హులు కారు.

మీ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించే విషయంలో, అంటే దాన్ని అవసరమైన ఇతరులకు అందించే విషయంలో, లేదా వ్యక్తిగత సమాచారానికి సంబంధించి మీ హక్కుల విషయంలో అదనపు సమాచారం గ్లోబల్ పాలసీ ఆన్ యూస్ ఆఫ్ పర్సనల్ డేటా పేజీ అనే పేజీలో పొందవచ్చు. మేము కుకీస్, అలాంటి మరితర టెక్నాలజీలను ఎందుకు వాడతామనే దాని గురించి గ్లోబల్ పాలసీ ఆన్ యూస్ ఆఫ్ కుకీస్, అలాంటి మరితర టెక్నాలజీలు అనే పేజీలో పొందవచ్చు.